SIRపై ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం కోసం ఎన్నికల సంఘం పని చేయదని స్పష్టం చేశారు. ఈసీని కేంద్రం వాడుకుంటుందనేది అవాస్తవమని తెలిపారు. SIR విషయంలో ఎన్నికల సిబ్బంది జవాబుదారీగా ఉంటుందన్నారు. దీనిపై ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ద సంస్థ అని పేర్కొన్నారు.