TG: హైదరాబాద్ పటాన్చెరులో పరువు హత్య జరిగింది. బీరంగూడకు చెందిన యువతిని శివ అనే యువకుడు గత కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు యువతి చెప్పింది. ఈ క్రమంలో పెళ్లి గురించి మాట్లాడేందుకు శివను యువతి తల్లిదండ్రులు ఇంటికి పిలిచారు. శివ ఇంటికి రాగానే.. క్రికెట్ బ్యాట్లతో కొట్టి చంపేశారు. శివ.. పటాన్చెరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు.