SKLM: మందస మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో బుధవారం ఏపీఎం కూర్మారావు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంచ సూత్రాలు పాటించే మహిళ సంఘాలకు రూ.8 లక్షల వరకు శ్రీనిధి రుణాలు తక్కువ వడ్డీతో అందుతాయని అన్నారు. జీడి, కొబ్బరి, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు పండించే మహిళా రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.