JGL: కోరుట్ల పరిధిలోని మల్లాపూర్ మండలం ఎంపీడీవో ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సత్య ప్రసాద్ సందర్శించారు. మొదటి విడత పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు, సిబ్బంది విధుల నిర్వహణ, పోలింగ్ సరళిని పరిశీలించారు.