MNCL: మొదటి విడత పంచాయితీ పోలింగ్‌కు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా శాంతియుతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు, గొడవలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.