PPM: ప్రకృతి వ్యవసాయ విధానాలు, బహుళ పంటల సాగు ద్వారా రైతులు నిరంతర ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సూచించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్ర సందర్శనలో భాగంగా బందలప్పి గ్రామానికి ఆయన బుధవారం చేరుకున్నారు. గ్రామంలోని కర్రి మురళి అనే రైతు పొలాన్ని సందర్శించి, అక్కడ సాగు చేస్తున్న వివిధ రకాల పంటల నమూనాలను పరిశీలించారు.