AP: శ్రీశైలంలో MLA వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా మాటల యుద్ధం సాగుతోంది. అబద్దాలతో బుడ్డా రాజశేఖర్ రెడ్డి MLA అయ్యారని మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి ఆరోపించారు. ఆయన తనను ఏమీ చేయలేరని అన్నారు. తాను తప్పు చేస్తే ఎందుకు జైల్లో పెట్టలేదని ప్రశ్నించారు. స్థానికి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, టీడీపీ నాయకుల అంతు చూస్తామని హెచ్చరించారు.