కృష్ణా: పామర్రు ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల బండిల్స్‌ను జిల్లా వైసీపీ కార్యాలయానికి బుధవారం తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. జగన్ పాలనలో ప్రజల ఆదరణతో స్థాపించబడిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలనే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విమర్శించారు.