కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో బుధవారం పండుగ సాయన్న ముదిరాజ్ వర్థంతి వేడుకలను ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో సాయన్న ముదిరాజ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.