TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా రేపే ఉంటుందని SEC రాణి కుముదిని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో రూ.8.2 కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.