ADB: తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి బుధవారం పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్థలు ఘన స్వాగతం పలికారు. రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.