E.G: రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల ఓ గర్భిణీ ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం వల్ల మరణించింది. విషయం తెలుసుకున్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దిగ్భ్రాంతి చెందారు. బుధవారం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే సందర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.