AKP: కోటవురట్ల మండలం గొట్టివాడ వద్ద అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసి ఇసుక రాయి రవాణా చేస్తున్న వాహనాల వద్ద సీనరేజ్ వసూలు చేస్తున్నట్లు జడ్పిటిసి ఉమాదేవి ఆరోపించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ విషయం అధికారులకు తెలుసా అని ప్రశ్నించారు. తన దృష్టికి రాలేదని ఎమ్మార్వో బదులిచ్చారు.