ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజును బుధవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు తమ కళాశాలల్లో ఈనెల 20 వరకు ఆలస్యం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. రూ. 200 జరిమానాతో ఈ నెల 22 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఉందని అధికారులు తెలిపారు.