TPT: శ్రీకాళహస్తి రూరల్ ఎస్సై నరసింహరావు అలిపిరికి బదిలీ అయ్యారు. ఈ మేరకు బదిలీపై వెళ్తున్న ఆయన్ను రూరల్ స్టేషన్ ఇంఛార్జ్, టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి, సిబ్బంది సత్కరించారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుడి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు.