SRD: గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కొండాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.