ADB: నేరస్తులు, దొంగలను పట్టుకోవడంలో జాగిలం రూని పాత్ర కీలకమని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. 2012 బ్యాచ్లో పోలీసు వ్యవస్థలోకి వచ్చిన జాగిలం రూని బుధవారం ఉదయం మరణించింది. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది నిర్వహించిన జాగిలం రూని అంత్యక్రియలో SP పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిబ్బంది దత్తూరం, గంగన్న, తిరుమలేశ్, దినేష్ తదితరులు ఉన్నారు.