TG: ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ మనిషికి కావాల్సింది నాలెడ్జ్ అని ఉద్ఘాటించారు. తనకు ఇంగ్లీష్ రాకున్నా రాష్ట్రాన్ని బాగా పరిపాలిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న జపాన్, చైనా, జర్మనీ దేశాలకు ఇంగ్లీష్ రాదన్నారు. చైనా సప్లై ఆపితే.. ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా ఒక గంట కూడా బతకలేదన్నారు.