MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండల కేంద్రాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. అయన వెంట అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాస్, ఎన్నికల పరిశీలకులు ఉన్నారు. బుధవారం ఆయన ఆయా మండల కేంద్రాల్లోని ఎన్నికల సామాగ్రి కేంద్రాలను పరిశీలించి, అధికారులకు సిబ్బందికి సూచనలు చేశారు.