W.G: నరసాపురం పట్టణంలోని పలు వార్డులను బుధవారం ఉదయం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సందర్శించి పారిశుద్ధ్యంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులు మరింత వేగంగా, సమర్థంగా చేయాలని ఆయన సంబంధిత కార్మికులకు ఆదేశించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. డంపింగ్ యార్డ్ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.