మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని KK5 మైన్ సింగరేణి కార్మికుడు తోట సతీష్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని బుధవారం BRS పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ పరామర్శించారు. ముందుగా సతీష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, మాజీ ఎమ్యల్యే ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.