MNCL: ఈనెల 13న నిర్వహించనున్న జవహర్ నవోదయ విద్యాలయలో ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు జిల్లాలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల DEO యాదయ్య తెలిపారు. ఉదయం 11.30 నుంచి 1.30 వరకు జరిగే పరీక్షకు 1722 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు 10 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, 11.30 తర్వాత అనుమతించరని వెల్లడించారు.