NZB: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఈనెల 14న HCL టెక్ బీ ఉద్యోగ మేళా నిర్వహిస్తోందని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవి కుమార్ తెలిపారు. 2024-25లో ఇంటర్లో 75 శాతం మార్కులు, మ్యాథ్స్ 60శాతం మార్కులు సాధించిన వారు అర్హులని, నగరంలోని వెంకటేశ్వర కంప్యూటర్ ఇన్స్ట్యూట్ నిర్వహించనున్న జాబ్ మేళాకు విద్యార్థులు హాజరుకావాలన్నారు.