JN: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగాలని ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, లింగాల ఘనపూర్, జాఫర్ఘడ్ రఘునాథపల్లి మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లను బుధవారం పరిశీలించి మాట్లాడారు. పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ పత్రాలు తప్పులేకుండా చెక్ చేయాలని అధికారులకు సూచించారు.