AP: స్థూల ఉత్పత్తిపై సీఎం చంద్రబాబు అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా.. గత ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధనానికి, ఆదాయానికి పొంతన లేకుండా స్థూల ఉత్పత్తి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.