ప్రకాశం: చీమకుర్తిలోని పలు గ్రానైట్ క్వారీలను కలెక్టర్ రాజబాబు, ఎమ్మెల్యే విజయకుమార్ బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. మైనింగ్ పనుల్లో తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని వారు సూచించారు. ఈ పరిశీలనలో ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, మైనింగ్ డీడీ రాజశేఖర్, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.