SKLM: కొత్తూరు మండలం జోగిపాడులో ఎమ్మెల్యే గోవిందరావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో స్థానిక నాయకులు ప్రజలతో మాట్లాడే గ్రామంలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రోడ్లు డ్రైనేజీలు పారిశుధ్యం మొదలగు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకువెళ్లారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన భరోసా కల్పించారు.