హెబ్బా పటేల్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘ఈషా’. ఈ సినిమాను శ్రీనివాస్ మన్నే తెరకెక్కిస్తున్నాడు. మొదట ఈ చిత్రాన్ని ఈనెల 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్‌ను ఈనెల 25కు వాయిదా వేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ‘భయపడడానికి ఇంకొంచెం టైం ఉంది’ అంటూ పోస్టర్ విడుదల చేసింది.