TG: ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ గుండెను కాపాడే బాధ్యత తనది అని ఉద్ఘాటించారు. రూ.1000 కోట్ల జీవోతో ఉస్మానియాకు వచ్చానని.. రెండేళ్లలో ఉస్మానియాకు ఏం కావాలో చేసే బాధ్యత తనదని అన్నారు. పైరవీలకు తావు లేకుండా ఓయూలో సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. 103ఏళ్ల చరిత్ర కలిగిన ఓయూను కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.