భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మల్లపెళ్లి గ్రామంలో ఓటరు సోయం మల్లయ్య ఇంటి ముందు పెట్టిన బోర్డు చర్చనీయాంశమైంది. “ఇందిరమ్మ ఇల్లు హామీ ఇస్తేనే ఓట్ల కోసం ఇంట్లోకి రండి..ఓట్లు అమ్మబడవు” అని రాసిన బోర్డు పెట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తనకు ఇల్లు రాలేదని..సమస్య పరిష్కారం కోసం ఈ మార్గం ఎంచుకున్నానని మల్లయ్య తెలిపారు.