TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా పడింది. దర్యాప్తుకు ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దర్యాప్తునకు, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి డేటా సేకరించేందుకు సహకరించాలని గతంలో ఆదేశించినా.. అమలు చేయడం లేదని పేర్కొంది.