MNCL: దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్, స్థానిక ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు. బుధవారం దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని వారు పరిశీలించారు. మండలంలోని 31 గ్రామ పంచాయతీలలో గురువారం స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నారు.