ఇండిగో విమానాల రద్దుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో వల్ల వేలమంది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారని తెలిపింది. ఈ ఘటన వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోయినట్లు వెల్లడించింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే, సంక్షోభ సమయంలో ఇతర సంస్థలు అడ్డగోలుగా ఛార్జీలు ఎలా పెంచుతాయని న్యాయస్థానం మండిపడింది.