యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన మూవీ ‘మోగ్లీ’. ఈ సినిమా తొలుత డిసెంబర్ 12న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బాలకృష్ణ ‘అఖండ 2’ ఈనెల 12న విడుదల కానున్న నేపథ్యంలో ‘మోగ్లీ’ డిసెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. ఈనెల 12న ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు తెలిపారు.