AP: పల్లెలే దేశానికి వెన్నెముక అని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. ఉన్నతాధికారులతో నిర్వహించిన మాటా-మంతీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పల్లెల కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని తెలిపారు. గెలిచిన తర్వాత గ్రామ సర్పంచ్‌లే మాట వినట్లేదని.. ఇక ఎమ్మెల్సీలు, మంత్రులు ఎలా వింటారని అభిప్రాయపడ్డారు. పని చేయకపోతే ఓ సమస్య, చేస్తే మరో సమస్య అన్నట్లుగా పరిస్థితి ఉందని పేర్కొన్నారు.