NLG: మొదటి విడత ఎన్నికలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను, సిబ్బందిని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గట్టుప్పల్లో ఏర్పాటు చేసిన డీఆర్సీ సెంటర్ను ఆమె బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయాలని తెలిపారు. రిసీవ్ చేసుకున్న సామాగ్రిని కూడా సిబ్బంది సరిచూసుకోవాలని సూచించారు.