NGKL: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రక్రియతో పాటు ఓట్ల లెక్కింపు సజావుగా కొనసాగాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. రేపు ఉదయం 7 గంటలకు 137 గ్రామ పంచాయతీలలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సిబ్బందితో పాటు అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.