హైదరాబాద్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మున్సిపాలిటీలు- కార్పొరేషన్ల విలీనం, నగర సమస్యలు, GHMC అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యచరణపై సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, వైఫల్యాలను ప్రశ్నిస్తూ నగర ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.