TG: ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని సీఎం రేవంత్ అన్నారు. ‘అణిచివేతకు గురైనప్పుడే పోరాటం పుడుతుంది. దండకారణ్యంలో పుట్టిన కొమురంభీం ఉద్యమాన్ని రగిలించారు. ఓయూలోనే తొలి దశ ఉద్యమం పుట్టింది. ఆ ఉద్యమం ఫలించక పోవడంతోనే విద్యార్థులు అడవి బాట పట్టారు. బడికి వెళ్లని అందెశ్రీ తెలంగాణ ఉద్యమ గేయాన్ని రచించారు’ అని వెల్లడించారు.