E.G: భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) తూర్పుగోదావరి జిల్లా నాయకులు మారిశెట్టి వీరబాబు బుధవారం తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న వీరబాబు అస్వస్థతకు గురై కొవ్వూరు తన నివాసంలో అకాలమరణం చెందారు. ఈయన బీసీ నాయకుడిగా పార్టీలో పని చేశారు. ఈ మరణానికి బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్, నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.