TG: తాను ప్రతి బడిలో రాష్ట్ర గీతాన్ని వినిపించానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘దర్పం ఉట్టిపడేలా తెలంగాణ తల్లిని జాతికి అంకితం చేశా. ఎస్సీ వర్గీకరణతో మాదిగ ఉపకులాల సమస్యకు పరిష్కారం చూపించా. కులగణన ద్వారా వందేళ్ల సమస్యకు పరిష్కారం. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. సామాజిక సమస్యలకు పరిష్కారం, సంక్షేమం ద్వారా అభివృద్ది సాధ్యం’ అని పేర్కొన్నారు.