NZB: మోస్రా మండలంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి బుధవారం పరిశీలించారు. రేపు జరగనున్న ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. పంచాయతీలకు పోలింగ్ నిర్వహణ, బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ అధికారుల వివరాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.