AP: ఈ ఏడాదిలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని CM చంద్రబాబు స్పష్టంచేశారు. రూ.9 వేల కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి ఈఆర్సీ అనుమతి ఇచ్చిందని.. అయినప్పటికీ పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రూ.5.19గా ఉన్న యూనిట్ విద్యుత్ ధరను రూ.4.92కు తగ్గించామని.. వచ్చే ఐదేళ్లలో విద్యుత్ కొనగోలు ధరను యూనిట్‌కు రూ.4కి తగ్గించేలా కృషి చేస్తున్నామని చెప్పారు.