NLR: కొవడలూరు (M) వెంకన్నపురంలో ఓ రిటైర్డ్ IAS అధికారి తీరు వివాదంగా మారింది. గ్రామంలో మహిళా సంక్షేమ, SC, BC, TTD భవనాలను ఆయన ప్రైవేటు వ్యక్తులకు 99 ఏళ్ల లీజుకు కట్టబెట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామానికి వచ్చిన కలెక్టర్ హిమాన్షు శుక్లా వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు.