గద్వాల్ జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న 102 అమ్మఒడి అంబులెన్స్ సేవలు గర్భిణీ స్త్రీలు, బాలింతలకు వెలకట్టలేని భరోసా అని 102 మేనేజర్ డి. రత్నమయ్య పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 10 అమ్మఒడి అంబులెన్స్‌లు నిరంతరంగా సేవలందిస్తున్నాయన్నారు. బుధవారం అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి సిబ్బంది అనుకున్న సమయానికి చేర్చడంతో స్థానికులు ప్రశంసించారు.