TG: భవిష్యత్లో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికల సంక్షేమంతో పాటు.. ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఆర్టీసీ వృద్ధికి ప్రణాళికలు వేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు.