కృష్ణా: ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు సీఐటీయూ అఖిలభారత 18వ మహాసభలు విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ మహా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ, మొవ్వలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు గోడ పత్రికలను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు దేవామణి, కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.