NZB: సాలూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఎన్నికల సామాగ్రి తరలింపు ప్రక్రియను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో పరిశీలించారు. ఎన్నికల సిబ్బంది ఎలాంటి పొరపాట్లు లేకుండా బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులను తరలించి, పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు. సబ్ కలెక్టర్ వెంట ఎంపీడీవో శ్రీనివాస్, సాలూరు తహశీల్దార్ శశిభూషణ్ ఉన్నారు.