ADB: ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని MLA అనిల్ జాదవ్ అన్నారు. నేరడికొండ మండలంలోని కుంటల గ్రామానికి చెందిన ఏకగ్రీవ సర్పంచ్, వార్డ్ మెంబర్, BRS నాయకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అభ్యర్థులను శాలువాతో సత్కరించి అభినందించారు. గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి జరిగిందని MLA పేర్కొన్నారు.