ASF: చింతల మానేపల్లి మండలంలో ఈరోజు సబ్ కలెక్టర్ శ్రద్దాశుక్ల పర్యటించారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలోని బాలాజీ అనుకోడ, రన్వెళ్లి, బూరెపల్లి గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.